MF​ బిజినెస్‌‌కు రిలయన్స్‌‌ గుడ్‌‌బై

MF​ బిజినెస్‌‌కు రిలయన్స్‌‌ గుడ్‌‌బై

మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌(MF) ‌‌‌ వ్యాపారం నుంచి వైదొలిగి, తన జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌ భాగస్వామి నిప్పన్‌‌‌‌ లైఫ్‌‌‌‌ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు వాటాలు అమ్మేశామని రిలయన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ (ఆర్‌‌‌‌క్యాప్‌‌‌‌) ప్రకటించింది. రిలయన్స్‌‌‌‌ నిప్పన్‌‌‌‌ లైఫ్‌‌‌‌ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏఎం)లో రెండు కంపెనీలకు 42.88 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు పబ్లిక్‌‌‌‌ షేర్‌‌‌‌ హోల్డర్ల చేతిలో ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం పబ్లిక్‌‌‌‌ షేర్‌‌‌‌ హోల్డర్ల వాటాల కొనుగోలుకు ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏఎం ఓపెన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ విధానంలో షేరుకు రూ.230 చొప్పున చెల్లించనుంది. ఈ వాటాల అమ్మకం వల్ల తమకు రూ.ఆరు వేల కోట్లు వస్తాయని ఆర్‌‌‌‌క్యాప్‌‌‌‌ తెలిపింది. ఈ నగదు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ రుణభారం సగం తగ్గుతుందని రిలయన్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అనిల్‌‌‌‌ అంబానీ అన్నారు. ఈ ఒప్పందం కోసం జేఎం ఫైనాన్షియల్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ రిలయన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌కు అడ్వైజర్‌‌‌‌గా వ్యవహరించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏఎం స్టాక్‌‌‌‌ 6.98 శాతం పెరిగి రూ.233కు చేరింది.