రిలయన్స్, జియోకి రూ.41 వేల కోట్ల లోన్‌‌‌‌‌‌‌‌

రిలయన్స్, జియోకి రూ.41 వేల కోట్ల లోన్‌‌‌‌‌‌‌‌
  • రిలయన్స్, జియోకి రూ.41 వేల కోట్ల లోన్‌‌‌‌‌‌‌‌
  • ఇప్పటికే రూ.24,600 కోట్లు 
  • 55 బ్యాంకుల నుంచి తీసుకున్న రిలయన్స్‌‌‌‌‌‌‌‌
  • మరో రూ.16,400 కోట్లు సేకరించేందుకు జియో రెడీ 

న్యూఢిల్లీ :  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌), ఈ కంపెనీ సబ్సిడరీ జియో ఇన్ఫోకామ్‌‌‌‌‌‌‌‌  ఏకంగా  5 బిలియన్ డాలర్లు (రూ. 41 వేల కోట్లు) సేకరించాయి.  ఫారిన్ కరెన్సీ లోన్స్‌‌‌‌‌‌‌‌ (బ్యాంకులు తమ ఫారిన్ కరెన్సీ ఫండ్స్ నుంచి ఇచ్చేవి)  కింద రిలయన్స్‌‌‌‌‌‌‌‌, జియో ఈ ఫండ్స్ సేకరించాయి. ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద సిండికేట్ లోన్ ( వివిధ బ్యాంకులు కలిసి ఇవ్వడం). రిలయన్స్ కిందటి వారం  55 బ్యాంకుల నుంచి 3 బిలియన్ డాలర్లు (రూ.24,600 కోట్లు) సేకరించింది.

ఈ బ్యాంకుల్లో  19  తైవనీస్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీసీ, ఎంయూఎఫ్‌‌‌‌‌‌‌‌జీ, సిటీ, ఎస్‌‌‌‌‌‌‌‌ఎంబీసీ, మిజుహో, క్రెడిట్ అగ్రికోల వంటి టాప్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులూ ఉన్నాయి.  ఈ ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌ను రిలయన్స్ కిందటి నెల 31 న క్లోజ్ చేసింది. జియో ఇన్ఫోకామ్‌‌‌‌‌‌‌‌ అదనంగా మరో 2 బిలియన్ డాలర్ల (రూ. 16,400 కోట్ల) ను 18 బ్యాంకుల నుంచి సేకరించనుంది. ఈ లోన్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం  దక్కించుకోగా, ఈ నెల చివరి నాటికి డీల్ పూర్తి చేయాలని చూస్తోంది. తాజాగా సేకరించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో  దేశం మొత్తం మీద 5జీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయాలన్నది జియో ప్లాన్‌‌‌‌‌‌‌‌.

2 బిలియన్ డాలర్ల లోన్‌‌‌‌‌‌‌‌ను రిలయన్స్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, జియో సమానంగా పంచుకుంటాయి. మొత్తం 5 బిలియన్ డాలర్ల లోన్‌‌‌‌‌‌‌‌ను ఒకే టెర్మ్ కింద రిలయన్స్ దక్కించుకుంది.  ఆయిల్ నుంచి టెలికం వరకు వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌లలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌కు లోన్లు ఇచ్చేందుకు లోకల్ బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు కూడా ఎగబడుతున్నాయి.