శ్రీరామ భక్తి : జనవరి 22వ తేదీ సెలవు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీ

శ్రీరామ భక్తి : జనవరి 22వ తేదీ సెలవు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీ

అయోధ్యలో బాల రాముడికి జనవరి 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ఇచ్చిన సంగతి తెలిసింది. మోదీ నిర్ణయానికి జయహో అంటున్న దేశంలోని నెంబర్ వన్ ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ.. అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని నడుస్తున్న అన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించారు అంబానీ..

జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూడటం కోసం.. ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు అంబానీ. దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు మూతపడనున్నాయి. ఇక ముఖేష్ అంబానీ అయితే ఆ రోజు అయోధ్యలో జరిగే కార్యక్రమంలో స్వయంగా ఫ్యామిలీతో హాజరుకానున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సగం రోజు సెలవు ప్రకటించగా.. లేటెస్ట్ గా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సగం రోజు సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.