దేశంలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే!

దేశంలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే!

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు:  దేశంలో అత్యంత విలువైన 500 కంపెనీల లిస్టును  యాక్సిస్ బ్యాంక్‌‌కు చెందిన బర్గండీ ప్రైవేట్‌‌తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసింది. మార్కెట్‌‌లో లిస్ట్‌‌ అయిన కంపెనీలకు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి, లిస్ట్ కాని కంపెనీలకు వాల్యుయేషన్ బట్టి ఈ లిస్టును రెడీ చేశామని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. రెండో ఎడిషన్ అయిన ‘2022 బర్డండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500’ లిస్టులో చోటు దక్కించుకోవడానికి  కంపెనీల  వాల్యూ కనీసం రూ.6,000 కోట్లుగా ఉండాలి.  ఈ  లిస్టులోని 10 శా  కంపెనీలు అంటే సుమారు 50 కంపెనీలు ఏర్పాటైన 10 ఏళ్లలోనే ఈ ఫీట్ అందుకున్నాయి.

ఈ లిస్టులోని ముఖ్యమైన అంశాలు..


1 దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ రూ.17,25,058 కోట్లుగా ఉంది. 
2ఇంకా మార్కెట్‌‌లో లిస్టు కాని అత్యంత విలువైన కంపెనీల్లో  సీరమ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్ ఇండియా టాప్‌‌లో ఉంది.  ఈ కంపెనీ వాల్యూ రూ.2,19,70‌‌‌‌0 కోట్లు.
3  450 శాతం గ్రోత్‌‌తో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో వేదాంత్‌‌ ఫ్యాషన్స్‌‌ టాప్‌‌లో ఉంది.
4 రూ.1,82,000 కోట్ల వాల్యూతో  అత్యంత విలువైన స్టార్టప్‌‌గా బైజూస్‌‌, ఎక్కువ ట్యాక్స్ కడుతున్న కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ (సుమారు ఏడాదికి రూ.16,297 కోట్లు) నిలిచాయి.  ఎక్కువ ప్రాఫిట్స్ (రూ.67,845 కోట్లు) సంపాదిస్తున్న కంపెనీల్లో  కూడా రిలయన్స్ టాప్‌‌లో ఉంది.
5 ఈ లిస్టులో ఎక్కువ కంపెనీలు టాటా గ్రూప్ నుంచే ఉన్నాయి. సుమారు 15 కంపెనీలు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌ టాప్‌‌లో నిలిచింది. ఈ కంపెనీ కింద 5,92,195 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరిన్ని..

1 . 2022 బర్గండీ ప్రైవేట్‌‌ హురున్  ఇండియా 500 లిస్టులోని 309 కంపెనీల  వాల్యూ ఏడాది ప్రాతిపదికన పెరగగా, 192 కంపెనీల వాల్యూ తగ్గింది.  ఆరు అదానీ గ్రూప్‌‌ కంపెనీల వాల్యూ ఏడాది ప్రాతిపదికన రూ. లక్ష కోట్ల చొప్పున పెరగడం గమనించాలి. 
2 ఈ లిస్టులోని మెజార్టీ కంపెనీల బేస్  ముంబైలో ఉంది. 159 కంపెనీలు ఈ సిటీ నుంచి ఉండగా, బెంగళూరు నుంచి 63,  ఢిల్లీ నుంచి 42 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. మొత్తంగా దేశంలోని 36 సిటీల నుంచి కంపెనీలు ఈ లిస్టులో స్థానం సంపాదించాయి.
3 ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎక్కువ కంపెనీలు (73) ఈ లిస్టులో ఉన్నాయి. ఆ తర్వాతి ప్లేస్‌‌లో హెల్త్‌‌కేర్‌‌‌‌ (60), సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ అండ్ సర్వీసెస్ (37), కెమికల్స్ (37) సెక్టార్లు ఉన్నాయి. 
4ఈ లిస్టులోని 500 కంపెనీలు సుమారు 72.6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. ఇందులో 11.6 లక్షల మంది మహిళలు ఉన్నారు. 
5 ఈ లిస్టులోని 410 కంపెనీల బోర్డుల్లో  మహిళల ప్రాతినిధ్యం ఉంది.
6ఈ 500 కంపెనీల మొత్తం సేల్స్ వాల్యూ  రూ.70 లక్షల కోట్లుగా ఉంది. కిందటేడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ.
72022 బర్గండీ ప్రైవేట్‌‌ హురున్  ఇండియా 500 లిస్టులోని కంపెనీల సగటు వయసు 37 ఏళ్లు.  సుమారు 42 శాతం కంపెనీలను ప్రొఫెషనల్ సీఈఓలు నడుపుతున్నారు.

తెలంగాణ నుంచి  31 కంపెనీలు..


2022 బర్గండీ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌ హురున్  ఇండియా 500 లిస్టులో తెలంగాణ రాష్ట్రం నుంచి 31 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.  దివీస్ ల్యాబ్స్‌‌‌‌,  డా.రెడ్డీస్‌‌‌‌, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్‌‌‌‌, హెటెరో వంటి టాప్ ఫార్మా కంపెనీలు తెలంగాణ నుంచే ఉన్నాయని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్  అనస్‌‌‌‌ రెహ్మాన్ జునైద్ అన్నారు.  ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ 31 కంపెనీల మొత్తం  వాల్యూ రూ. ఐదు లక్షల కోట్లుగా ఉంది. రూ.95,8‌‌‌‌‌‌‌‌05 కోట్ల వాల్యూతో   దివీస్ ల్యాబ్స్ టాప్‌‌‌‌లో ఉండగా, రూ.73,788 కోట్లతో డా.రెడ్డీస్‌‌‌‌, రూ.31,532 కోట్లతో అరబిందో ఫార్మాలు తర్వాతి ప్లేస్‌‌‌‌లలో నిలిచాయి. తెలంగాణ నుంచి  మొత్తం 16 హెల్త్‌‌‌‌కేర్ కంపెనీలు, 4 సాఫ్ట్‌‌‌‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు  ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఈ 31 కంపెనీల మొత్తం సేల్స్ వాల్యూ రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. ఇవి 2.2 లక్షల మందికి జాబ్స్‌‌‌‌ ఇచ్చాయి. సగటున ఒక కంపెనీలో 7,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లిస్టులోని తెలంగాణ కంపెనీల సగటు వయసు 30 ఏళ్లు.


ఇంకా మార్కెట్‌‌‌‌లో లిస్టు కాని అత్యంత విలువైన  10 కంపెనీలు.. 


కంపెనీ    వాల్యూ (రూ.కోట్లలో)
1) సీరం ఇన్‌‌స్టిట్యూట్‌‌    2,19,700
2) బైజూస్‌‌    1,82,200
3) ఎన్‌‌ఎస్‌‌ఈ    1,39,000
4) స్విగ్గీ    88,600
5) ఓయో    77,800
6) డ్రీమ్‌‌ 11    66,200
7) పార్లే ప్రొడక్ట్స్‌‌    62,600
8) రేజర్ పే    62,100
9) ఓలా    60,500
10) ఇంటస్ ఫార్మా    59,300


ఎక్కువ కంపెనీలు ఈ  గ్రూప్‌‌‌‌ల నుంచే..


గ్రూప్‌‌    కంపెనీల సంఖ్య    టాప్ కంపెనీలు
1) టాటా గ్రూప్     15    టీసీఎస్‌‌, టైటాన్‌‌, టాటా స్టీల్‌‌
2) అదానీ గ్రూప్‌‌    8     అదానీ   ట్రాన్స్‌‌మిషన్‌‌, గ్రీన్‌‌ ఎనర్జీ, పోర్ట్స్‌‌ 
3) మురుగప్ప గ్రూప్‌‌    6     చోళమండలం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌, కోరమండల్ ఇంటర్నేషనల్
4) ఆదిత్య బిర్లా     5    గ్రాసిమ్‌‌, హిందల్కో
4) జిందాల్‌‌    5    జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌, ఎనర్జీ
6) బజాజ్ గ్రూప్‌‌    4    బజాజ్‌‌ ఫిన్సర్వ్‌‌, ఆటో
6) టీవీఎస్ గ్రూప్‌‌    4    టీవీఎస్ మోటార్స్‌‌, సుందరం ఫైనాన్స్‌‌
6) గోద్రేజ్‌‌     4    గోద్రేజ్ కన్జూమర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌, ప్రాపర్టీస్‌‌
6) రాజన్‌‌ రహేజా    4    ఎక్సైడ్‌‌ ఇండస్ట్రీస్‌‌, ప్రిస్మ్‌‌ జాన్సన్‌‌
10) హెచ్‌‌డీఎఫ్‌‌సీ    3    హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ
10) పిరమల్‌‌ గ్రూప్‌‌    3    పిరమల్‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌, పిరమల్ గ్లాస్‌‌