ఫోర్బ్స్‌‌ గ్లోబల్ లిస్ట్‌‌లో రిలయన్స్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ

ఫోర్బ్స్‌‌ గ్లోబల్ లిస్ట్‌‌లో రిలయన్స్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ
  • మొత్తంగా 2000 కంపెనీలతో తాజా జాబితా రూపకల్పన
  • 57 ఇండియన్ కంపెనీలకు చోటు

న్యూఢిల్లీ : ఫోర్బ్స్‌‌ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే 2 వేల అతిపెద్ద పబ్లిక్ కంపెనీల జాబితాలో 57 ఇండియన్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ర్యాంక్ ఇండియన్ కంపెనీగా నిలిచింది. గ్లోబల్‌‌గా రిలయన్స్ ర్యాంక్ 71 అని ఈ బిజినెస్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌‌‌‌లో తీసుకుంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్లోబల్‌‌గా 11వ ర్యాంక్‌‌ను సంపాదించుకుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ లిమిటెడ్ కూడా.. టాప్ టెన్ గ్లోబల్ కన్స్యూమర్ ఫైనాన్స్‌‌ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. గ్లోబల్‌‌గా ఈ కంపెనీ 332వ ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది. కన్స్యూమర్ ఫైనాన్స్ సెక్టార్‌‌‌‌లో అమెరికన్ ఎక్స్‌‌ప్రెస్‌‌ టాప్‌‌లో ఉంది. మొత్తం లిస్ట్‌‌లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాది టాప్‌‌లో నిలిచింది.

ఈ జాబితాలో 61 దేశాలకు చెందిన కంపెనీలున్నాయి.  అమెరికా నుంచి ఎక్కువగా 575 కంపెనీలు ఈ లిస్ట్‌‌లో చోటు పొందాయి. దాని తర్వాత చైనా  అండ్ హాంకాంగ్ నుంచి 309, జపాన్ నుంచి 223 కంపెనీలు ఈ లిస్ట్‌‌లో స్థానం దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ తెలిపింది. మొత్తంగా టాప్‌‌ టెన్‌‌లో నిలిచిన కంపెనీల్లో ఐసీబీసీ తర్వాత జేపీ మోర్గాన్, చైనా కన్‌‌స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆపిల్, పింగ్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ చైనా, రాయల్ టచ్ షెల్, వెల్స్ ఫార్గోలున్నాయి. ఇండియా నుంచి టాప్ 200లో నిలిచింది ఒకే ఒక్క కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీసే. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ 209వ స్థానం, ఓఎన్‌‌జీసీ 220వ స్థానం, ఇండియన్ ఆయిల్ 288వ స్థానం, హెచ్‌‌డీఎఫ్‌‌సీ లిమిటెడ్ 332 వ స్థానంలో ఉన్నాయి. టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌‌ అండ్ టీ, ఎస్‌‌బీఐ, ఎన్‌‌టీపీసీలు కూడా టాప్ 500లో ఉన్నాయి. గ్లోబల్ 2000 లిస్ట్‌‌లో ఉన్న ఇతర ఇండియన్ కంపెనీలు టాటా స్టీల్, కోల్ ఇండియా, కొటక్ మహింద్రా బ్యాంక్, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌‌‌‌టెల్, విప్రో, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్, పవర్‌‌‌‌ గ్రిడ్, హిందాల్కో, హెచ్‌‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌‌సర్వ్, గెయిల్, గ్రాసిమ్,పీఎన్‌‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్‌‌లు.