లాభాల్లోకి రిలయన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా.. క్యూ4లో రూ.4,387 కోట్ల నికర లాభం

లాభాల్లోకి రిలయన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా.. క్యూ4లో రూ.4,387 కోట్ల నికర లాభం

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌ఫ్రా) ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ.4,387 కోట్ల నికర లాభం సాధించింది.  ఖర్చులు తగ్గడంతో కంపెనీ ప్రాఫిట్ పెరిగింది. కిందటేడాది జనవరి–-మార్చి కాలంలో రూ.220.58 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  ఎక్స్చేంజ్‌‌‌‌ ఫైలింగ్ ప్రకారం, క్యూ4లో కంపెనీ రూ.8,274.87 కోట్ల రెవెన్యూ సంపాదించింది. కిందటేడాది క్యూ4లో ఇది కేవలం రూ.298.73 కోట్లు మాత్రమే. మొత్తం 2024–25 కోసం,  ఆర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా రూ.4,937.52 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ.1,608.66 కోట్ల లాస్ వచ్చింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌ఫ్రా పవర్, రోడ్స్, మెట్రో రైల్, డిఫెన్స్ సెక్టార్స్‌‌‌‌లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌‌‌‌పీవీలు) ద్వారా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది.