జియోకు కొత్తగా 1.56 లక్షల కస్టమర్లు

జియోకు కొత్తగా 1.56 లక్షల కస్టమర్లు

హైదరాబాద్, వెలుగు: టెలికం రెగ్యులేటర్ ​ట్రాయ్​ డేటా ప్రకారం రిలయన్స్ జియో ఈ ఏడాది ఏప్రిల్​లో తెలుగు రాష్ట్రాల్లో 1.56 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌లో 55 వేల మంది చేరారు.  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది. ఏప్రిల్ నెలలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది.