జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ వైఫై కాలింగ్

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ వైఫై కాలింగ్

ఇప్పటివరకూ తమ కస్టమర్లకు ఎన్నో ఆఫర్లు ఇచ్చిన ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో.. కొత్తగా వినియోగదారుల కోసం మరో శుభవార్తను తెలిపింది. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో కూడా దగ్గర్లోని ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.దీనికోసం అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. డేటా మాత్రమే ఖర్చవుతుంది.

గత కొన్ని నెలలుగా వైఫై ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే ఫీచర్‌ని పరీక్షించి జనవరి 8న ఈ సౌకర్యాన్ని అందుబాటులోని తెచ్చినట్టు చెప్పింది రిలయెన్స్ జియో. జనవరి 16 కల్లా దశలవారీగా ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది.

ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే జియో ఈ ఫీచర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ కొన్ని మొబైల్‌ మోడళ్లకే పరిమితం కాగా.. జియో వైఫై కాలింగ్‌ సదుపాయం దాదాపు 150కి పైగా మోడళ్లలో పనిచేయనున్నట్టు తెలిపింది జియో.

వైఫై కాలింగ్ సదుపాయాన్ని అండ్రాయిడ్, ఐఓఎస్ రెండు మొబైల్ డివైస్ లలో ఎనేబుల్ చేసి పొందవచ్చు.

మీరు IOS డివైస్(ఫోన్) వాడినట్లయితే.. వైఫై కాలింగ్ కోసం ఇలా చేయండి

  1. మొబైల్ లోని సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  2. ఫోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  3. అందులో వై-ఫై కాలింగ్ మీద క్లిక్ చేయండి.
  4. స్విచ్ ని ఎనేబుల్ చేయండి.

Android డివైస్ వాడినట్లయితే.. 

  1. మొబైల్ లోని సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  2. కనెక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  3. స్విచ్ ని ఎనేబుల్ చేయండి

Reliance Jio launches free voice calls over WiFi: How to enable it on your phone