
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ కనెక్టెడ్ యూసేజ్ చార్జీలు (ఐయూసీ)లపై కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రిలయన్స్ టెలికం కంపెనీ జియో కొత్త రీచార్జ్‌లను విడుదల చేసింది. రూ.222, రూ.333, రూ.444 ఆల్ ఇన్ వన్ ప్రిపెయిడ్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు మూడు వేల నిమిషాల వరకు టాక్‌టైమ్ ఇస్తోంది. అన్ని ప్లాన్లలో రోజుకు 2జీబీ డేటా ఇస్తారు. ప్రత్యర్థి కంపెనీల ప్లాన్లతో పోలిస్తే వీటి ధరలు 20 శాతం తక్కువని జియో తెలిపింది. ఇంతకాలం అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితకాలింగ్ సదుపాయం కల్పించిన ఈ కంపెనీ, జియోయేతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల చొప్పున ఐయూసీ వసూలు చేస్తున్నది. ఇదిలా ఉంటే, జియో రూ.19,రూ.52 వోచర్లను తొలగించింది. రూ.19 ప్యాక్‌తో రీచార్జ్ చేయించుకుంటే 150 ఎంబీ డేటా, 20 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీని వ్యాలిడిటీ ఒక రోజు. రూ.52 ప్యాక్‌తో రీచార్జ్ చేయించుకుంటే 1.05 ఎంబీ డేటా, 70 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. వ్యాలిడిటీ ఏడు రోజులు.