ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులపై జియో వేటు

ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులపై జియో వేటు

ముంబై :  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్​ 5 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో 500 నుంచి 600 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా, మిగతా వారు కాంట్రాక్ట్ ఉద్యోగులని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు, ఆపరేటింగ్ మార్జిన్లు పెంచుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఉద్యోగుల తొలగింపులో ఎక్కువగా కన్జ్యూమర్ విభాగంలో పనిచేసే వారు ఉన్నట్టు తెలిసింది. సప్లయ్ చైన్, హెచ్‌‌ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌‌వర్క్స్‌‌లో పనిచేస్తున్న వారిపై కూడా ఈ లేఆఫ్ ప్రభావం ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

కన్జ్యూమర్ వ్యాపారాలను విస్తరిస్తున్నామని, జియో ఇండస్ట్రీలో ఎప్పటికీ నెట్ రిక్రూటర్‌‌‌‌గానే కొనసాగుతుందని జియో అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తాము కాంట్రాక్టర్స్‌‌తో కలిసి పనిచేస్తామని, వారిని ఫిక్స్‌‌డ్ టైమ్ కాంట్రాక్ట్‌‌ల కోసం పలు ప్రాజెక్ట్‌‌లలో నియమించు కుంటామని చెప్పారు.  జియోలో మొత్తంగా 15 వేల నుంచి 20 వేల మంది
ఉద్యోగులున్నారు.