
దేశంలోనే లీడింగ్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. మరో కొత్త ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది.. 2024 కొత్త సంవత్సరం లో . జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్స్‌కి 'న్యూ ఇయర్ 2024' ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆవివరాల గురించి తెలుసుకుందాం. . .
జియో న్యూ ఇయర్ 2024 ఆఫర్ వివరాలు..
రిలయన్స్ జియో రూ. 2999 ప్లాన్‌పై కొత్త ఆఫర్‌ని ప్రకటించింది సంస్థ. సాధారణంగా.. ఈ ప్లాన్‌లో 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. కానీ.. జియో న్యూ ఇయర్ 2024 ఆఫర్‌తో.. వాలిడిటీ అనేది మరో 24 రోజులు పెరుగుతుంది. అంటే.. రూ. 2999 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, ప్లాన్ వాలిడిటీ 389 రోజులుగా ఉంటుంది. అంటే.. రోజుకు 7.70 ఖర్చు అవుతుంది.
ఈ జియో 2999 ప్లాన్‌తో రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. మొత్తం మీద 912.5జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఈ ప్లాన్ కు వర్తిస్తాయి. ఇంకా అదనంగా ఈ ప్లాన్ తో జియో టీవీతోపాటు జియోసినిమా, జియోక్లౌడ్ వంటివి పొందొచ్చు. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా కూడా ఈ ప్లాన్‌తో లభిస్తుంది.
అయితే.. ఈ రూ. 2999 ప్లాన్ అనేది అందరికి ఉపయోగపడకపోవచ్చు. ప్రతి రోజు.. ఎక్కువ డేటా వాడేవారికి ఇది సరిగ్గా ఉపయోగపడుతుంది. . మిగిలిన వారు మరింత అఫార్డిబుల్, తక్కువ డేటా ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో సంస్థ చెప్పలేదు. కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
4 ఓటీటీలు ఒకే ప్లాన్‌తో..
JioTV Premium Plans : జియో టీవీ ప్రీమియం ప్లాన్స్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఒకే ప్లాన్ తో ఏకంగా 14 ఓటీటీలను అందిస్తుంది. కొన్ని రోజుల క్రితమే.. ఈ ప్లాన్స్‌ని జియో లాంచ్ చేసింది. దీంతోపాటు మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేయడం విశేషం. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి.