రిలయన్స్‌‌– మెటా భారీ డేటా సెంటర్‌‌‌‌.. గుజరాత్‌‌ జామ్ నగర్లో ఏర్పాటు

రిలయన్స్‌‌– మెటా భారీ డేటా సెంటర్‌‌‌‌.. గుజరాత్‌‌ జామ్ నగర్లో ఏర్పాటు

న్యూఢిల్లీ:  రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌  మెటాతో  కలిసి గుజరాత్‌‌లోని జామ్‌‌నగర్‌‌లో 168 మెగావాట్ల  సామర్థ్యం గల భారీ డేటా సెంటర్‌‌ను  నిర్మించనుంది. మెటా కోసం భారతదేశంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న  మొదటి డేటా సెంటర్ ఇదే. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేయాలని టార్గెట్‌‌ పెట్టుకున్నారు.   అవసరమైతే దీని కెపాసిటీని మరింత పెంచే వీలుంది.  ఈ హైపర్‌‌స్కేల్ డేటా సెంటర్ పూర్తిగా  రెన్యూవబుల్‌‌ ఎనర్జీతో నడుస్తుంది.

 అలాగే దీనిని చల్లబరచడానికి  డీశాలినేటెడ్ సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు. 2020లో జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన మెటా, ఇప్పుడు ఈ సరికొత్త డేటా సెంటర్ ద్వారా తన అంతర్జాతీయ ఏఐ  అవసరాలను తీర్చుకోనుంది. దీనికోసం క్లీన్‌‌మ్యాక్స్, ఫోర్త్ పార్ట్‌‌నర్ సంస్థలతో కలిసి దాదాపు 1 గిగావాట్  క్లీన్ ఎనర్జీని సమకూర్చకోనుంది.  

రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ డిజైన్, నిర్మాణం నుంచి నెట్‌‌వర్క్ కనెక్టివిటీ, జియో ఫైబర్ గ్రిడ్, పవర్ సప్లయ్‌‌,  ఆపరేషన్స్ వరకు అన్ని సేవలను  సింగిల్‌‌ విండో  ద్వారా పర్యవేక్షిస్తుంది. గుజరాత్ పశ్చిమ తీరంలోని సబ్‌‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఈ డేటా సెంటర్‌‌‌‌ దగ్గరగా ఉంది.