వికసిత భారత్​కు కంపెనీల బాసట..మొదటిస్థానంలో రిలయన్స్

వికసిత భారత్​కు కంపెనీల బాసట..మొదటిస్థానంలో రిలయన్స్
  • తర్వాతి స్థానాల్లో హిందుస్థాన్ యూనిలీవర్, అదానీ గ్రూప్
  • వెల్లడించిన ఇండియా ఇన్వాల్వ్​డ్​ ర్యాంకింగ్స్

న్యూఢిల్లీ: వికసిత భారత్‌‌‌‌‌‌‌‌ లక్ష్యానికి ఇండియా కార్పొరేట్​కంపెనీలు ఏ మేరకు దోహదపడతాయో కొలిచే ‘ఇండియా ఇన్వాల్వ్​డ్​ ర్యాంకింగ్ 2023’లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటిస్థానంలో నిలిచింది.   ఆ తర్వాతి స్థానాల్లో హిందుస్థాన్ యూనిలీవర్, అదానీ గ్రూప్ ఉన్నాయి.   స్కోచ్​ అనే సంస్థ ఆరు నెలల సుదీర్ఘ అధ్యయనం ఈ వివరాలను సేకరించింది. 

ఇందుకోసం 231 సూచికల ద్వారా అనేక కంపెనీలను విశ్లేషించింది. - జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్ లిమిటెడ్ 'ఇండియా ఇన్వాల్వ్​డ్​ ర్యాంకింగ్ ఇన్ డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్'లో మొదటిస్థానంలో నిలిచింది. దాని తర్వాతి స్థానంలో లుపిన్,  హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవన్నీ టెక్నాలజీ వాడకంలో దూసుకెళ్లడమే కారణం.2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి 'వికసిత్​ భారత్ 2047' కార్యక్రమాన్ని చేపట్టారు.   వందో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఈ టార్గెట్​ను సాధించడం దీని లక్ష్యం. 

ఈఎస్​జీలో హెచ్​యూఎల్​ నంబర్​వన్​

ఎన్విరాన్​మెంట్​, సోషల్, కార్పొరేట్​గవర్నెన్స్​(ఈఎస్​జీ) విభాగంలో  హిందుస్థాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో ఉండగా, అదానీ గ్రూప్,  బ్రిటానియా తర్వాత ఉన్నాయి. కార్పొరేట్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్​ప్లేస్​లో​ ఉండగా, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లైఫ్  ,  ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘‘రిలయన్స్ ఎప్పుడూ 'భారతదేశానికి ఏది మంచిదో, రిలయన్స్‌‌‌‌‌‌‌‌కు అదే మంచిది' అని నమ్ముతుంది. దాని పెట్టుబడులు, ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు, ఆశయాలు, విజయాలు అన్నీ భారతదేశానికి మేలు చేస్తాయి. రిలయన్స్ వికసిత భారత్ పట్ల తన నిబద్ధతను పదే పదే ప్రదర్శించింది. రిలయన్స్ ఫౌండేషన్, భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ దాతృత్వ సంస్థ”అని ఆర్​ఐఎల్​తెలిపింది. 

 కేజీడీ6 గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి ఓకే 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బంగాళాఖాతంలోని కేజీడీ6 బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గ్యాస్ నిల్వల అభివృద్ధి కోసం అదనపు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ ఆమోదం పొందింది. ఇక్కడ ఉత్పత్తిని  రోజుకు 4 నుంచి 5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు పెంచుతామని కంపెనీ అధికారి తెలిపారు.   రిలయన్స్,  దాని భాగస్వామి బ్రిటిష్​పెట్రోలియం ప్రస్తుతం కేజీడీ6 బ్లాక్ నుంచి దాదాపు 30 ఎంఎంఎస్​సీఎండీ లేదా భారతదేశ గ్యాస్ ఉత్పత్తిలో 30 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి.  ఉత్పత్తి పెంపు కోసం తాము తయారు చేసిన అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని రిలయన్స్​ వెల్లడించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఐదు మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (రోజుకు) టార్గెట్​ను చేరుకుంటామని ఆయన చెప్పారు.