హోటల్‌‌కూలిన 10 నెలలకు డెడ్‌‌బాడీ దొరికింది

హోటల్‌‌కూలిన 10 నెలలకు డెడ్‌‌బాడీ దొరికింది

ఓ హోటల్‌ కూలి 10 నెలలైన తర్వాత ఆ శిథిలాల్లో చిక్కుకున్న ఓ కన్‌స్ట్రక్చన్‌ వర్కర్‌ మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. అమెరికాలోని న్యూ ఓర్లియార్లిన్స్‌రాష్ట్రంలో శనివారం జరిగిందీ సంఘటన. న్యూ ఓర్లియార్లిన్స్‌‌‌‌‌‌‌‌లో హార్డ్‌ రాక్‌ హోటల్‌ కడుతుండగా గతేడాది అక్టోబర్‌ 12న అది కూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న ముగ్గురు వర్కర్లు బిల్డింగ్‌ శిథిలాల్లో చిక్కుకొని చనిపోయారు. వీళ్లలో ఒకరి మృతదేహాన్ని వెంటనే కనుగొని వెలికితీశారు. మిగిలిన ఇద్దరి డెడ్‌ బాడీల కోసం వెతకడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తాజాగా మరో వర్కర్‌ క్విన్నియోన్‌ వింబెర్లీ(36) మృతదేహాన్ని కనుగొన్నారు. ఇంకో వర్కర్‌ జోస్‌ పొన్సే అరియోలా (63) బాడీ కోసం బిల్డింగ్‌ 8వ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో వెతుకుతున్నారు. చివరి మృతదేహం వెలికితీయగానే సిటీ మధ్యలో ఉన్న ఈ బిల్డింగ్‌ను పూర్తిగా కూలగొట్టేస్తామని చెప్పారు. అక్టోబర్‌ నాటికల్లా ఈ పని పూర్తవుతుందని అన్నారు.