సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్‌ ఖైదీ పరార్

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్‌ ఖైదీ పరార్

మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్‌ ఖైదీ పరారయ్యాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బిహార్​కు చెందిన రిమాండ్ ఖైదీని వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, పోలీసుల కళ్లు కప్పి పారిపోయినట్లు సమాచారం. అయితే, ఈ విషయమై జైలు సూపరింటెండెంట్ శివకుమార్​ను వివరణ కోరగా, ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే అప్రమత్తమై ఆ ఖైదీని తిరిగి పట్టుకున్నట్లు తెలిపారు.