ఎన్నారైలు ఇండియాకు పంపింది 9.20 లక్షల కోట్లు

ఎన్నారైలు ఇండియాకు పంపింది 9.20 లక్షల కోట్లు
  • 2022–23 లో రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • జీడీపీలో 3.2 శాతానికి సమానం
  • యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఏఈ నుంచి ఎక్కువ

న్యూఢిల్లీ:  విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్నారైలు పంపే డబ్బులు) ఏటా పెరుగుతున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ ఏకంగా 112 బిలియన్ డాలర్ల (రూ.9.20 లక్షల కోట్ల) కు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక  సంవత్సరంలో ఇండియాకు  వచ్చిన రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. అంతేకాకుండా గత ఐదేళ్లలో ఇదే హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా. ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం, 2021–22 లో ఇండియాకు 89.1 బిలియన్ డాలర్లు (రూ.7.30 లక్షల కోట్లు) , 2020–21 లో 80.2 బిలియన్ డాలర్లు (రూ.6.56 లక్షల కోట్లు) , 2019–20 లో 83.2 బిలియన్ డాలర్లు (రూ.6.82 లక్షల కోట్లు) , 2018–19 లో 76.4 బిలియన్ డాలర్లు (రూ.6.26 లక్షల కోట్లు)  రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఇండియాకు వచ్చాయి. కరోనా తర్వాత గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ  సాధారణ స్థాయికి తిరిగొస్తోందని, ఎన్నారైలు ఇండియాకు పంపుతున్న రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా, ఫారిన్ కరెన్సీ వస్తే ఇండియా ఫారెక్స్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మరింత పెరుగుతాయి. 

ఈ దేశాల నుంచే ఎక్కువ..

యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యునైటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (యూఏఈ) లో ఉంటున్న ఎన్నారైలు ఇండియాకు ఎక్కువగా రెమిటెన్స్ పంపుతున్నారు.  2022–23 లో ఇండియాకు  ఈ దేశాల నుంచి భారీగా రెమిటెన్స్ వచ్చాయి.  యూకే, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌదీ అరేబియా, కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా నుంచి కూడా బాగానే వచ్చాయి.  మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏషియా దేశాల్లోకి వెళుతున్న  రెమిటెన్స్ ఈ ఏడాది కేవలం 0.3 శాతం మాత్రమే పెరుగుతుందని వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ అంచనావేస్తోంది. ముఖ్యంగా యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్ ఇబ్బంది పడుతోందని, దీంతో ఐటీ వర్కర్లకు డిమాండ్ తగ్గిపోతుందని పేర్కొంది.  ఆయిల్ ధరలు ఎక్కువగా పెరగడంతో గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలకు వలస వెళ్లిన ఇండియన్ల ఆదాయం  2022 లో పెరిగిందని, రష్యన్ ఫెడరేషన్ నుంచి సెంట్రల్ ఆసియా దేశాలకు పెద్ద మొత్తం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యిందని వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించింది. యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లిన వారు కూడా భారీగా రెమిటెన్స్ పంపారని వివరించింది.  కిందటేడాది సౌత్ ఏషియా దేశాలకు  వచ్చిన రెమిటెన్స్ విలువ​ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి 176 బిలియన్ డాలర్లకు ఎగసిందని పేర్కొంది. కిందటేడాది ఎక్కువగా రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న దేశాల్లో ఇండియా (111 బిలియన్ డాలర్లు), మెక్సికో (61 బిలియన్ డాలర్లు ), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (38 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (30 బిలియన్ డాలర్లు ) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి  ముఖ్యంగా ట్రేడ్ డెఫెసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక వ్యవస్థకు  సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి.  కిందటేడాది ఇండియాకు వచ్చిన రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాటా జీడీపీలో ఏకంగా 3.2 శాతానికి సమానంగా ఉంది. 

తగ్గనున్న కరెంట్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెఫెసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా కరెంట్ అకౌంట్ డెఫెసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మొత్తం గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) జీడీపీలో 1.4 శాతంగా రికార్డవుతుందని ఈ ఏడాది మే నెలలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ శాచ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనా వేసింది. కిందటేడాది ఈ నెంబర్ 2.4 శాతంగా రికార్డయ్యింది. ఇండియాకు భారీగా రెమిటెన్స్ వస్తుండడం వంటి కారణాలతో దేశ కరెంట్ అకౌంట్ డెఫెసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనాలను కంపెనీ తగ్గించింది. అంతేకాకుండా ఈ ఏడాది దేశంలోకి వచ్చే నెట్ రెమిటెన్స్ 104 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ఇది గతంలో వేసిన అంచనా 92 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ‘ఇండియాకు వస్తున్న రెమిటెన్స్ విలువలో పెద్ద మార్పులు ఉండవు.  కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇవి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ఉన్నాయి. ట్రేడ్ డెఫెసిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరెంట్ అకౌంట్ డెఫెసిట్ అంచనాలు తగ్గాయి’ అని క్రిసిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ ధర్మకీర్తి జోషి అన్నారు.