గంజాయి రవాణా చేస్తూ పట్టుపడిన సర్పంచ్ పై వేటు

గంజాయి రవాణా చేస్తూ పట్టుపడిన సర్పంచ్ పై వేటు
  • ఉప సర్పంచ్ కు బాధ్యతలు అప్పగింత

సంగారెడ్డి జిల్లా:  సిర్గాపూర్ మండలంలోని గరిడే గావ్ సర్పంచ్ కొండా బాలాజీ   గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడి సర్పంచ్ పదవిని కోల్పోయారు. ఉప సర్పంచ్ కు ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధిత గంజాయిని సర్పంచ్ కొండా బాలాజీ అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రిమాండ్ కు తరలించిన విషయాన్ని పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల కు తెలియజేశారు. ప్రజా ప్రతినిధిగా ఉండి నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ .. కొండా బాలాజీని సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.