నాలా పూడికతీతకు ఏం అడ్డొచ్చినా తొలగించండి : హైడ్రా కమిషనర్ రంగనాథ్

నాలా పూడికతీతకు ఏం అడ్డొచ్చినా తొలగించండి : హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాలాల్లో పూడిక తీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి ఎక్కడైనా ఇండ్లు కాకుండా ఏం అడ్డొచ్చినా తొలగించాల్సిందేనని హైడ్రా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్  ఏవీ రంగనాథ్  అధికారులను ఆదేశించారు. వానాకాలానికి ముందే నాలాలు, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద కాల్వల్లో పూడిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గించాలన్నారు. ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్మత్​న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కృష్ణాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమీర్​పేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప్రాంతాల్లో జరుగుతున్న డీసిల్టింగ్​పనులను ఆయన పరిశీలించారు. పూడికతీతకు ఎండాకాలమే మంచి అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశమని, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు మొదలైతే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేమన్నారు. 

వాట్సాప్ ద్వారా స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాచారమివ్వండి

డివిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుగుతున్న తీరుపై ఎప్పటిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పుడు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాచారం ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని  స్థానిక కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్  కోరారు. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్య ఎక్కడుందో కాలనీ వారికే  తెలుస్తుందని, ఆ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యకు కార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణం, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కారం కూడా వారికే తెలిసి ఉంటుందన్నారు. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాచారం ఇస్తే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కారానికి చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకుంటామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని 
 చెప్పారు.