ఈనెల 28 నుంచి రెన్యూఎక్స్  

ఈనెల 28 నుంచి రెన్యూఎక్స్  

హైదరాబాద్, వెలుగు: నగరంలోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఈ నెల 28, 29 తేదీలలో రెండు రోజులపాటు రెన్యూవబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పో, ‘రెన్యూఎక్స్’ 7వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తామని  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మా మార్కెట్స్ ప్రకటించింది. రెన్యువబుల్​ ఎనర్జీ కొనుగోదారులను, అమ్మకందారులను ఇది ఒక వేదికపైకి తీసుకువస్తుంది. వ్యాపార అవకాశాలను దక్కించుకునేందుకు, కొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు వీలు కల్పిస్తుంది.  రెన్యువబుల్​ ఎనర్జీ పరిశ్రమల పోకడలు, సవాళ్లు, మార్కెట్ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చలు జరుగుతాయి.

పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్, ఇన్వర్టర్లు, ఛార్జ్ కంట్రోలర్లు, బ్యాటరీలు, టెస్టింగ్ మానిటరింగ్ సిస్టమ్స్, కాంపోనెంట్ తయారీదారులు, మంత్రిత్వ శాఖ అధికారులు, రెగ్యులేటరీ సంస్థలు, మునిసిపాలిటీలు,  ప్రాజెక్ట్ డెవలపర్లు, ప్లానర్లు, పెట్టుబడిదారులు, ఫండ్ మేనే జర్లు, బ్యాంకర్లు, ప్రాజెక్ట్ డెవలపర్లు ఇందులో పాల్గొంటారు.