అంతర్జాతీయ నృత్యకారుడు శాంతి మోహన్ మృతి

అంతర్జాతీయ నృత్యకారుడు శాంతి మోహన్ మృతి

పాల్వంచ,వెలుగు: అంతర్జాతీయ స్థాయి వేదికలపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన కళాకారుడు మరీదు శాంతిమోహన్ (78) మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. శాంతి మోహన్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు నారాయణ కుమార్, రమణ కుమార్, కుమార్తె నృత్యకారిణి మాధవీలత ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఆయన ఉమ్మడి జిల్లాలో నృత్య ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు.  కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ లో ఫోర్ మెన్ గా పని చేస్తూ వందలాదిమంది విద్యార్థులను నృత్య కళాకారులుగా తీర్చిదిద్దారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఆయనకు చెన్నై యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఫోర్ మెన్ గా పనిచేస్తూ 2003లో పదవీ విరమణ చేశారు.  అభినయ కూచిపూడి నాట్య నిలయం ఏర్పాటు చేసి శాంతి మోహన్ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. శాంతి మోహన్ మృతి విషయం తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బుధవారం కేటీపీఎస్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.