Vastu Tips:  అద్దె పోర్షన్ వాస్తు ఎలా ఉండాలి... దక్షిణ దిక్కుకు వాలు ఉంటే వచ్చే నష్టాలేంటి

Vastu Tips:  అద్దె పోర్షన్ వాస్తు ఎలా ఉండాలి... దక్షిణ దిక్కుకు వాలు ఉంటే వచ్చే నష్టాలేంటి

చిన్న ఇల్లు కట్టినా.. పెద్ద బంగ్లా కట్టినా సరే.. వాస్తు కంపల్సరీ.  ఇంటి వాస్తు సరిగాకచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది.  కొంతమంది చిన్న గుడిసెలో ఉన్నా సంతోషంగా గడుపుతారు.  ఆర్థికంగా ఎంతో బాగుండి.. అధికారం ఉన్నా కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో గడుపుతుంటారు .  అద్దె ఇల్లు వాస్తు సరిగా లేకపోతే దాని ప్రభావం ఎవరిపై ఉంటుంది. వాస్తు సరిగా లేకపోతే అద్దె పోర్షన్లు ఖాళీ అవుతుంటాయా..  రేకుల ఇంటికి దక్షిణం దిక్కు వాలు ఉంటే వచ్చే నష్టాలేంటి.. వాస్తు.. బ్రహ్మ.. భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ అయిన  కాశీనాథుని సుబ్రహ్మణ్యంగారు అందించిన సలహాల గురించి తెలుసుకుందాం. . .! 

ప్రశ్న :  మేము రెండేళ్ల క్రితం వేరేవాళ్లు కట్టించుకున్న ఇంటిని కొన్నాం. దాంట్లో కింద రెండు, పైన రెండు పోర్షన్లు ఉన్నాయి. మొదట్నించీ మేము కింద గదుల్లో ఉంటూ.. పైన ఉన్న పోర్షన్లను అద్దెకు ఇచ్చాం. అయితే ఒక పోర్షన్ తో  ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే రెండో పోర్షన్​ లో  ఎవ్వరూ మూడు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పి ఖాళీ చేస్తున్నారు. వాస్తు దోషం వల్లే ఇలా జరుగుతోందని తెలిసిన వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది. మరి దాని ప్రభావం మా మీద ఉంటుందా?

జవాబు : ఏ ఇంటి వాస్తు దోషాలైనా.. అందులో ఉండే వాళ్లపైనే ఉంటాయి. మీ ఇంటి పై పోర్షన్ వాస్తు బాగోలేదంటున్నారు. కాబట్టి ఒకసారి వాస్తు నిపుణులకు చూపించండి. దానివల్లే అద్దెకు ఉండేవాళ్లు మారుతున్నట్లు తెలిస్తే వెంటనే వాస్తును సరిచేయండి. ముఖ్య విషయం అద్దెకు ఇవ్వడానికి కేటాయించిన ఇల్లెనా.... అది ఖాళీగా ఉంటే, వాస్తు వల్ల కలిగే చెడు ప్రభావం ఇంటి యజమానిపైనే పడుతుంది. ఇల్లే కాదు ఖాళీ స్థలం వాస్తు సరిగా లేకున్నా.... ఆ దుష్ప్రభావాలు కచ్చితంగా యజమాని మీద ఉంటాయి.

ప్రశ్న :  మొన్నటివరకు మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. కిరాయి కట్టడానికి ఇబ్బంది అవ్వడం వల్ల, ఈ మధ్య మాకు ఉన్న చిన్న స్థలంలో రెండు రేకుల రూములు వేసుకున్నాం. మొదట బాగానే ఉన్నా, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సొంత ఇంట్లో కంటే అద్దె ఇంట్లోనే మంచిగుండే వాళ్లం. అయితే ఈమధ్య ఇంటికి వచ్చిన ఒక పెద్దాయన... రేకుల వాలు దక్షిణం వైపుకు ఉంచటం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పాడు. నిజంగా దాని వల్లే మాకు ఈ సమస్యలు వస్తున్నాయా?

జవాబు :మీరు ఇల్లు కట్టేటప్పుడు చేసిన పెద్ద తప్పు రేకుల వాలును దక్షిణం దిక్కుకు పెట్టడమే. మీ సమస్యలకు కారణం వాస్తు దోషం అయి ఉండవచ్చు. ఎందుకంటే ఇంటి పై కప్పు వాలు ఎప్పుడూ ఉత్తరం, తూర్పు ఈశాన్యం దిక్కులోనే ఉండాలి. అలాకాకుండా మరి ఏవైపునకు ఉన్నా మంచిది కాదు. అది రేకుల ఇల్లెనా, బంగ్లా అయినా... ఈశాన్యం మూల గోడ మిగతా గోడల కంటే తక్కువ ఎత్తులో లేదా సమానంగానైనా ఉండాలి. అలాగే నైరుతి మూల గోడ ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మీ సమస్యలు దూరం కావాలంటే వాలు సరైన దిక్కుల్లోకి మార్చాలి.