
గత రెండు రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) కుమారుడు అకిరా నందన్(akira nandan) సినీ ఎంట్రీ గురించి పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు(Raghavendra rao) అకిరా యూఎస్‌లో ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యాడని పోస్ట్ చేయడమే. దీంతో అందరు అకిరా సినీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. అయితే.. అలాంటిది ఏమీ లేదని, అకిరాకు నటనపై ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్(Renu desai).
అయితే అది చుసిన ఓ నెటిజన్.. ఫిలిం స్కూల్స్ లో చాలా మంది నటన నేర్చుకుంటారు. మంచి నటులవడానికి ఎంతో కష్టపడతారు. కానీ.. ఒక స్టార్ కిడ్స్ మాత్రం ఎలాంటి కష్టం లేకుండా డైరక్ట్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కామెంట్స్ చేశాడు.
తాజాగా నెటిజన్ చేసిన కామెంట్స్ కు రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ.. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మరి అంబానీ తన కంపెనీలని, ఆస్తులని తన కొడుకుకో, కూతురికో కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం సమంజసమే అంటారా? అవును మీరన్నది నేను ఒప్పుకుంటాను.. వారసులుగా హీరో, నిర్మాత, డైరెక్టర్స్ పిల్లలు ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వాళ్లకి ఆ ఎంట్రీ మాత్రమే ఈజీగా ఉంటుంది. ఆతరువాత వాళ్ళ పేరెంట్స్ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినా, నటుడిగా ఫెయిల్ అయినా దారుణంగా ట్రోల్స్ చేస్తారు. కానీ కొత్తగా వచ్చిన వారి ఫెయిల్యూర్ ని ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ వారసుడు, స్టార్ కిడ్స్ అనేది ముఖ్యం కాదు. టాలెంట్ ఉండాలి అంతే అంటూ రిప్లై ఇచ్చారు రేణు. ప్రస్తుతం రేణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.