Renu Desai: బ్రదర్.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. అడివి శేష్, అకిరా ఫొటో వైరల్

Renu Desai: బ్రదర్.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. అడివి శేష్, అకిరా ఫొటో వైరల్

ఈ మధ్య కాలంలో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి మరో పోస్ట్ చేశారు ఆమె. అయితే ఈసారి ఆమె చేసిన పోస్ట్ చాలా ప్రత్యేకంగా అనిపించింది. కారణం.. ఆమె షేర్ చేసిన ఫొటోలో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, కుమారుడు అకిరా ఉన్నారు. అంతేకాదు.. ఈ పోస్ట్ లో రేణు దేశాయ్ అడివి శేష్ ని బ్రదర్ అంటూ సంభోదించారు. దీంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరో అడివి శేష్, పవన్ కుమారుడు అకీరా నందన్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెల్సిందే. ఇదే విషయాన్ని అడివి శేష్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వైరల్ అయినా వీరి ఫోటోలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో.. అకిరా టాలీవుడ్ అరంగేట్రానికి సంబంధించిన విషయాలన్నీ అడివి శేష్ చూసుకుంటున్నారని అనుకున్నారు అంతా. 

ఈక్రమంలోనే.. తాజాగా రేణు దేశాయ్ అడివి శేష్, అకిరా నందన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వేరే తల్లికి పుట్టినా..  నాకు బ్రదర్ లాంటివాడు అడివి శేష్. అడివి శేష్, అకిరా ఇద్దరూ ఒక క్యూట్ టీమ్..  అంటూ పోస్ట్ చేశారు రేణు దేశాయ్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇవి చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ త్వరలోనే పవన్ వారసుడి ఎంట్రీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.