
పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu deshai) సంచలన కామెంట్స్ చేశారు. తన విషయంతో పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికీ తప్పే కానీ.. సమాజానికి మంచి చేద్దాం అనుకున్న ఆయన తపన గొప్పదంటూ చెప్పుకొచ్చారు.
- ALSO READ : నాకు పెద్ద దండలు వేయొద్దు : పవన్ కల్యాణ్
ఓ ప్రముఖ ఛానెల్ లో వీడియో కాల్ లో హాజరైన ఆమె పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిగత, రాజకీయ అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేణూదేశాయ్ మాట్లాడుతూ.. నా విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికీ తప్పే కానీ.. ప్రజల కోసం మంచి చేద్దాం అంకునే ఆయన తన గొప్పది, ఆయన ఆశయాలు గొప్పవి. అందరి కోసమే ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనలోనే ఉంటారు ఎప్పడూ. ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇకనైనా మూడు పెళ్లిళ్ల విషయాన్నీ పక్కన పెట్టండి. రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు కానీ.. ప్రతీసారి వ్యక్తిగత విషయాలను బయటకు లాగకూడదు. దయచేసి ఇందులోకి పిల్లల్ని లాగకండి అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇటు ఇండస్ట్రీ పరంగా, అటూ రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.