
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, ఆయన వ్యక్తిగత జీవితంపై మూవీ తీస్తామని కొందరు ప్రకటించిన నేపథ్యంలో.. పవన్ కల్యాన్ రాజకీయ జీవితంలోకి తనని, తన పిల్లలను లాగొద్దని కోశారు రేణు దేశాయ్. అంతేకాదు.. తన మాజీ భర్త తనకు అన్యాయం చేశారని.. అయినా సరే ఆయనకే నా సపోర్ట్ అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. దీంతో పవన్ కళ్యాణ్ హేటర్స్ ఆమెను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. వీటిపై మరోసారి స్పందించారు రేణు దేశాయ్.
నా విడాకుల విషయంలో ఎం జరిగిందనే నిజాలు చెప్పినప్పుడు పవన్ అభిమానులు నన్ను చాలా దారుణంగా అసభ్య పదాలతో దూషించారు. ఇప్పుడు.. బాధ్యత గల పౌరురాలిగా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన్ని ద్వేషించేవారు నన్ను దుర్భాషలాడుతున్నారు. విడాకుల విషయంలో నా మాజీ భర్త(పవన్ కళ్యాణ్) గురించి నేను మాట్లాడింది అక్షరాల నిజం. అలాగే ఇటీవల ఆయన గురించి చెప్పింది కూడా నిజం. అప్పుడు కొంతమంది నన్ను డబ్బులు తీసుకుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ రెండింటిలో ఏమాత్రం నిజంలేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాలని చెప్పాను. తెలిపాను. నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. ఇది నా విధి అయితే, ఇలాగే ఉండనివ్వండి. దయచేసి నాపై అసభ్యమైన కామెంట్స్ పెట్టకండి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు రేణు దేశాయ్. దీంతో ఆమె చేసిని కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.