మా అమ్మాయి చెప్పడం నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్: రేణుదేశాయ్

మా అమ్మాయి చెప్పడం నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్: రేణుదేశాయ్

కొంత గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్‌‌‌‌ రోల్‌‌‌‌లో వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఇలా ముచ్చటించారు.

ఇందులో నేను సమాజ సేవకురాలు హేమలత లవణం గారి పాత్రలో నటించాను. ఆమెది లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీ. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ బందిపోటు దొంగలను కలిసి అనేక రిఫార్మ్స్ చేశారు. అలాగే జోగిని వ్యవస్థపై, అంటరానితనంపై పోరాటం చేశారు. యంగర్ జనరేషన్‌‌‌‌లో  ఆమె ఎంతో స్ఫూర్తిని నింపుతారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం ఏ జన్మ పుణ్యమో. షూటింగ్‌‌‌‌కు ముందు కొందరిని కలిసి ఆమె గురించి తెలుసుకోవడం ఆ పాత్ర పోషించడానికి ఎంతో హెల్ప్ అయింది. అలాగే ఆమె బాడీ లాంగ్వేజ్‌‌‌‌పైనా వర్క్ చేశాను.  ఈ పాత్ర నాకు చాలా తృప్తిని ఇవ్వడంతో పాటు నాలో చాలా మార్పు తెచ్చింది. సామాజికంగా ఇప్పటివరకూ చేసింది సరిపోదు, ఇంకా పని చేయాలనిపించింది. 

చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో ఉండకూడదనేది నా లక్ష్యం. ఎంతవరకూ కుదిరితే అంత ఆ దిశగా పని చేయాలి. రవితేజ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, అభిషేక్ గారి నిర్మాణంలో పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో నా పాత్ర చూసి ‘వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు గర్వంగా వుందమ్మా’ అని మా అమ్మాయి చెప్పడం నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇలాంటి మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. ఇక నా కొడుకు అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి, యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్, పియానో నేర్చుకున్నాడు. తనకి రైటింగ్  ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని  మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా.  తన కొడుకుని బిగ్ స్క్రీన్‌‌‌‌పై చూడాలని ప్రతి తల్లికి ఉంటుంది.