కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపలే ఉన్నరు : ఎంపీ రేణుకా చౌదరి

కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపలే ఉన్నరు : ఎంపీ రేణుకా చౌదరి
  • వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నరు: ఎంపీ రేణుకా చౌదరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. పార్లమెంట్​కు కుక్కను తీసుకురావడం చర్చకు దారితీసింది. ఎంపీలకు ఉన్న ప్రత్యేక హక్కులను రేణుకా చౌదరి దుర్వినియోగం చేశారని, ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

దీనిపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ‘‘నేను పార్లమెంట్​కు వస్తుండగా కుక్కను స్కూటర్, కారు ఢీకొనడం చూశా. ఆ టైమ్​లో రోడ్డుపై తిరుగుతున్న చిన్న కుక్కపిల్లకు ఏమవుతుందో అన్న భయంతో రక్షించి నా కారులో ఎక్కించుకుని పార్లమెంట్​కు తీసుకొచ్చిన. 

ఈ విషయంలో చర్చించడానికి ఏముంది? నిజమైన కుక్కలు ఎలాంటి హానీచేయవు. కరిచే వ్యక్తులు పార్లమెంట్ లోపలే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’’ అంటూ రేణుకా చౌదరి బదులిచ్చారు.