- ఇన్సూరెన్స్ మరింత చొచ్చుకుపోయేందుకే...
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ప్రొడక్టులతోపాటు జిమ్ మెంబర్షిప్స్, వెహికల్ రిపెయిర్స్, డయాగ్నస్టిక్ సర్వీసులు వంటి వాటిని కూడా అమ్మేందుకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు త్వరలో వీలు కలగనుంది. ఇన్సూరెన్స్ చట్టంలో ఈ మేరకు సవరణలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సవరణలతో కూడిన ఇన్సూరెన్స్ బిల్లును మాన్సూన్ సెషన్లో పార్లమెంట్ ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. కొత్త ఆపర్చునిటీస్ను తేవడమే కాకుండా, ఇన్సూరెన్స్ సెక్టార్లో కొన్ని కీలకమైన సంస్కరణలూ బిల్లులో చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టడం మరింత సులువు కానుంది.
జిమ్, రిపెయిర్, డయాగ్నస్టిక్సేవలు..
రిలేటెడ్ బిజినెస్‌ల ప్రొడక్టులను అమ్మడానికి జనరల్ ఇన్సూరెన్స్కంపెనీలకు అవకాశమిచ్చేలా కొత్త రూల్స్ ఉంటాయని, కానీ బ్యాంకుల తరహాలో మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ ప్రొడక్టులు అమ్మడానికి మాత్రం ఛాన్స్ ఉండదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రిలేటెడ్ సర్వీసులు, ప్రొడక్టులు ఏవనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిర్ణయించనుంది. ఫైర్ ఇన్సూరెన్స్‌తో కలిపి ఫైర్ ప్రొటెక్షన్ సర్వీసులు, మోటార్ ఇన్సూరెన్స్‌తో కలిపి కార్ రిపెయిర్ సర్వీసులు, హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిపి డయాగ్నస్టిక్ టెస్టులు వంటివి ఆఫర్ చేయడానికి కంపెనీలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.
విదేశాల్లోని రూల్స్..
యూకేలో ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యాల్యూ యాడెడ్ సర్వీసులతోపాటు, క్రాస్ సెల్లింగ్ చేసేందుకూ రూల్స్ ఒప్పుకుంటున్నాయి. సింగపూర్లోనైతే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ క్లయింట్లకు ఫైనాన్షియల్ ఎడ్వైజరీ సేవలు కూడా అందించే వీలుంది. ఇన్సూరెన్స్ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉండే సేవలను అమ్మడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను మలేషియాలో అనుమతిస్తున్నారు.
