పెద్ద చెరువు కట్టకు రిపేర్లు చేయించాలి : ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు

పెద్ద చెరువు కట్టకు రిపేర్లు చేయించాలి : ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు
  •     ఇన్​చార్జ్ మంత్రి జూపల్లికి వినతి

నిర్మల్, వెలుగు: భారీ వర్షాల కారణంగా సోన్ మండలం కడ్తాల్ లో దెబ్బతిన్న పెద్ద చెరువు కట్టకు రిపేర్లు చేపట్టాలని కోరుతూ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కూచాడి శ్రీహరిరావు కోరారు. శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. చెరువుకట్ట తెగిపోవడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని, మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. 

పంట పొలాల్లోకి వెళ్లే రహదారులు సైతం దెబ్బతిన్నాయన్నారు. పెద్ద చెరువుపై ఆధారపడి సుమారు 150 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని, ప్రస్తుతం చెరువులో నీరు లేక పంటలు ఎలా సాగు చేయాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వెంటనే చెరువుకట్టకు రిపేర్లు చేపట్టాలని కోరారు. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ  చైర్మన్లు సోమ భీంరెడ్డి, అబ్దుల్ హాది, ఆయా గ్రామాల సర్పంచ్ లు ఉన్నారు.