తీసుకున్న రూ.200 తిరిగివ్వలేదని చంపాడు

తీసుకున్న రూ.200 తిరిగివ్వలేదని చంపాడు

అప్పులు లేనిపోని గొడవలకు కారణమవుతాయి. ఎంత మంచి స్నేహితులైన డబ్బు విషయంలో బద్ద శత్రువులుగా మారుతారు. కలిసి బిజినెస్ చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ సైతం లావాదేవీల్లో ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే అప్పు ఇవ్వరాదు, అడగరాదని పెద్దలు హితవు చెబుతారు. తీసుకున్న రూ.200 తిరిగి ఇవ్వలేదని జరిగిని గొడవలో ఓ నింపు ప్రాణాన్ని బలైంది. ఈ ఘటన హైదరాబాద్ లో హఫీజ్ పేటలో బుధవారం (ఫిబ్రవరి 13) రాత్రి జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మియాపూర్ పోలీసులు వివరాల ప్రకారం.. హఫీజ్ పేటలోని ఆదిత్య నగర్ లో నివసించే అబ్దుల్ రెహమాన్(18) తన ఫ్రెండ్ అమీర్ దగ్గర రోజుల క్రితం రూ.200 తీసుకున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 13) సాయంత్రం రెహమాన్, అమీర్ లు మాట్లాడుకోవడానికి హఫీజ్ పేటలోని ఎవరు లేని ప్రాంతానికి వెళ్లారు. అమీర్ తనకు రావాల్సిన రూ.200 లు ఇవ్వమని రెహమాన్ ను అడిగాడు. అక్కడ వారికి మాటామాటా పెరిగి గొడవకు దిగారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన అమీర్ బండ రాయిని తీసుకొని రెహమాన్ తలపై మోదాడు. తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో రెహమాన్ అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడు అబ్దుల్ రెహమాన్ ఓ మాల్ లో క్లీనర్ గా పని చేస్తుంటాడు. ఈ ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Also Read : రిసార్టులో పెళ్లి విందు.. గుండెపోటుతో RMP డాక్టర్ మృతి