మెదక్‌ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉంది

మెదక్‌ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉంది

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం ఇపుడు హైకోర్టుకు చేరింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్‌ తరపున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా... తమ భూముల్లో మెదక్ కలెక్టర్ భూములు సర్వే చేయడంపై సమాధానం చెప్పాలన్నారు. మెదక్‌ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు.

పట్టా భూముల ను కొనుగోలు చేసి జమున హ్యాచరీస్‌ కంపెనీ పెట్టారని.. ధరణి పోర్టల్ లో కూడా అవి పట్ట భూములని ఉన్నాయిని పిటిషన్ లో తెలిపారు. సాధారణంగా ఏదైనా విచారణ జరిగితే కొన్ని రోజుల పాటు జరుగుతుంది..కానీ ఇక్కడ అత్యoత వేగంగా విచారణ పూర్తి చేసినట్టు నివేదిక ఇచ్చారన్నారు. రైతుల ఫిర్యాదు ను స్వీకరించి డీటైఎల్డ్ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఇలాంటి విచారణ సమయంలో కచ్చితంగా ఓనర్ లకు నోటీసులు ఇవ్వాలి..కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కొన్ని గంటల్లోనే రిపోర్ట్ తయారు చేసి.. సాయంత్రానికి నివేదిక సిద్ధం చేస్తామని అధికారులు మీడియా లో మాట్లాడారు. ఫిర్యాదు వచ్చిన మరుసటి రోజే ఉదయం 6 గంటల నుండి విచారణ చేపట్టారన్నారు. తయారు చేసిన నివేదికలో కూడా లెక్టర్ ఈటల జమునా w/o నితిన్ అని రాశారని పిటిషన్ లో పేర్కొన్నారు. నివేదిక త్వరితగతిన పూర్తి చేయాలని.. కనీసం జాగ్రతలు తీసుకోకుండా ఇష్టానుసారంగా బంధాలను కూడా మార్చేశారని తెలిపారు.


కలెక్టర్ ఇచ్చిన నివేదికలో 66 ఏకరాలు అసైన్డ్ భూములు అని ఉంది. 58.37 ఎకరాల్లో పొజిషన్ లో ఉంది.  కలెక్టర్  హోదా లో ఉండి సక్రమంగా విచారణ జరుపకుండ అత్యంత వేగంగా నివేదిక ఇవ్వడం  ఏమిటని పిటిషన్ లో ప్రశ్నించారు. ఈ చర్యలు అన్నీ కూడా ప్రీ ప్లాన్ గా జరిగాయని...నివేదిక పత్రాన్ని ఇప్పటి వరకు పిటిషనర్ కు ఇవ్వలేదన్నారు. అధికారుల కంటే ముందే మీడియా ప్రతినిధులు ఆ సర్వే భుములోకి ఎలా వెళ్తారంటూ పిటిషనర్ దాఖలు చేశారు న్యాయవాది. తమ కంపెనీలోకి తమ అనుమతి లేకుండా ప్రవేశించి విచారణ చేసిన అధికారాల పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.