IPL 2024: ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ

IPL 2024:  ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ

టీ20 క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చే ఉద్దేశ్యంతో బీసీసీఐ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన కారణంగా.. ఐపీఎల్ జట్లు ఓ అదనపు ఆటగాడితో బరిలోకి దిగుతున్నాయి. బ్యాటర్/ బౌలర్ ఎవరి సేవలు అవసరమైతే వారిని ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఒక జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే.. తుది జట్టులోబ్యాటర్‌ను తీసుకొని, సెకండ్ ఇన్నింగ్స్‌ సమయంలో అతని స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను దించుతోంది. ఈ నిబంధన వల్ల ప్రత్యర్థి జట్టు అంతే లాభ పడుతోంది. 

ఇటీవల రోహిత్ శర్మ.. ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్‌లతో కలిసి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.  ఆ సమయంలో అతనికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు బదులిచ్చిన హిట్‌మ్యాన్.. ఈ రూల్‌ వల్ల వల్లే ప్రయోజనాల కంటే ప్రతికూలతలే ఎక్కువని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ నిబంధన కారణంగా ఆల్‌రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలానే కొనసాగితే ఆల్‌రౌండర్ల ఏర్పడుతుందని చెప్పకనే చెప్పాడు.

Also Read: స్టార్ ఆటగాళ్ళైనా తలొంచాల్సిందే: ధోనీపై అభిమానం చాటుకున్న రాహుల్

"నేను ఇంపాక్ట్ ప్లేయర్(రూల్)కి అభిమానిని కాదు. మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కేవలం ప్రజలకు వినోదాన్ని అందించడం కోసమే ఈ ఆట. చివరికు తుది జట్టులో 11 మంది ఆటగాళ్లే..  12 మంది ఆటగాళ్ళు కాదు.. ఈ రూల్ వల్ల ఆల్ రౌండర్లు తగ్గిపోతారని నేను భావిస్తున్నా.. అందుకు నేను మీకు చాలా ఉదాహరణలు ఇవ్వగలను.. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి వారు బౌలింగ్ చేయలేరు, ఇది మాకు మంచిది కాదు.." అని హిట్ మ్యాన్ వివరణ ఇచ్చారు. 

తప్పనిసరి కాదు..

ఇంపాక్ట్ ప్లేయర్ నియమంపై ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో దీనిపై సమీక్షించేందుకు  బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు ఐపిఎల్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్పనిసరి కాదని, సీజన్ ముగిసిన అనంతరం ఈ నిబంధనపై ఫ్రాంచైజీ యజమానులతో చర్చిస్తామని తెలిపారు.