మహానీయుల జయంత్యుత్సవాలకు హాజరుకండి

మహానీయుల జయంత్యుత్సవాలకు హాజరుకండి
  •     మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సామాజిక సమతా వేదిక ఆహ్వానం

గోదావరిఖని, వెలుగు: ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి 14వరకు గోదావరిఖనిలో నిర్వహించ తలపెట్టిన జయంత్యుత్సవాలకు హాజరుకావాలని సామాజిక సమతా వేదిక ప్రతినిధులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని కోరారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్యాంప్​ఆఫీస్​లో వేదిక ప్రతినిధులు గుమ్మడి కుమారస్వామి, పులి మోహన్​, పెంచాల తిరుపతి, పర్లపల్లి రవి, చింతకింది సంపత్​, తదితరులు మంత్రిని కలిసి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి 12వరకు గోదావరిఖని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్​ నెహ్రూ స్టేడియంలో అంబేద్కర్​ప్రీమియర్​ లీగ్​ క్రికెట్​ పోటీలు నిర్వహిస్తున్నామని, 4న కాకా వెంకటస్వామి స్మారక స్పాన్సర్​షిప్​తో అంబేద్కర్​జీవిత చరిత్రపై గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో నాటక ప్రదర్శన చేయనున్నారని చెప్పారు. 5న జగ్జీవన్​రామ్​ జయంతి, 11న జ్యోతిరావ్​పూలే జయంతి, 13న సమతా ర్యాలీ, 14న అంబేద్కర్​ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.