హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు 

హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు 

హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబిడ్స్ లోని కలెక్టరేట్ లో జరిగిన ఈ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా హాజరై... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మహాత్మాగాంధీ ఫోటోకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు.