మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి గ్రామస్తుల వినతి

మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి  గ్రామస్తుల వినతి

మెదక్, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులో ఫార్మాక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆ కంపెనీ ఏర్పాటైతే  కాలుష్య సమస్య తలెత్తుతుందని, చెరువులు, కుంటల్లోని నీరు కలుషితం అవుతుందని, ప్రజలు రోగాల బారిన పడతారన్నారు.

ఇప్పటికే మా గ్రామ శివారులో పెద్దపెద్ద క్రషర్లు ఏర్పాటు చేశారని, వాటి శబ్దాలకు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామన్నారు. బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల అందులో నుంచి  కలుషితమైన నీరు వచ్చి చెరువులోకి వస్తున్నాయని తెలిపారు. కంపెనీకి అనుమతులు ఆపకుంటే త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు.