నీట్ పీజీ పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

నీట్ పీజీ పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

నీట్ పీజీ పరీక్షలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందని సమర్థించింది సుప్రీం కోర్టు. రిజర్వేషన్ మెరిట్ కు విరుద్ధంగా లేదని అభిప్రాయపడింది ఉన్నత న్యాయస్థానం. నీట్ పీజీ ఆల్ ఇండియా కోటా సీట్లలో ఓబీసీకి 27 శాతం రాజ్యాంగ సవరణను స్వాగతించింది. పోటీ పరీక్షలు కొన్ని తరగతులు పొందే ఆర్థిక సామాజిక ప్రయోజనాన్ని ప్రతిబింబించదని అంది సుప్రీం కోర్టు. ఇలాంటి వ్యవహారాల్లో రిజర్వేషన్లు ఇచ్చే ముందు ఇకపై సుప్రీం అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈనెల 7న నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లను పునరాలోచించాలని వేసిన పిటిషన్ పై వివరణాత్మక ఆదేశాలిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లను తిరస్కరించలేమంది సుప్రీం కోర్టు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల నిలుపదలపై ఎలాంటి ఉత్తర్వులుండవని స్పష్టం చేసింది, రిజర్వేషన్ల వల్ల సామాజిక న్యాయం జరుగుతుందనేదే ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది ఉన్నత న్యాయస్థానం.

ఇవి కూడా చదవండి: 

భారత యువకుడ్ని కిడ్నాప్ చేసిన చైనా

డిటర్జెంట్ పేరుతో లక్షల్లో నగదు తరలింపు