- బరిలో నిలిచేందుకు ఆశావహుల ఉత్సాహం
- అభ్యర్థిత్వాలు ఓకే చేసుకునేందుకు ప్రయత్నాలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళలకు 738 సర్పంచ్ స్థానాలు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామ పంచాయతీ వారీగా ఖరారైన రిజర్వేషన్లకు సంబంధించి అధికారిక గెజిట్ ను సోమవారం కలెక్టర్లు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,613 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ, అన్రిజర్వ్డ్కలుపుకొని మొత్తం 738 సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే మెదక్ జిల్లాలో 223, సంగారెడ్డి జిల్లాలో 283, సిద్దిపేట జిల్లాలో 232 సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి ఈ మేరకు రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు.
పార్టీ రహితమే అయినా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ దాదాపు అన్నిచోట్ల ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఎప్పటి నుంచో సర్పంచ్ కావాలని కలలు కంటూ, ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన వారు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని అందరికీ చెబుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిల ఆమోదం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
పోటీకి లైన్క్లియర్గా ఉన్న వారు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ పెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలించిన ఆశావహులు చాన్స్ రాక నిరాశలో ఉన్న వారి వద్దకు వెళ్లి మద్దతు కోరే ప్రయత్నంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.
లైన్ క్లియర్ చేసుకునేందుకు..
ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట ఇతర పోటీ దారులను ఒప్పించి తమకు మద్దతు ఇచ్చేలా లైన్ క్లియర్ చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయి తమకు చాన్స్ లభించని లీడర్లు తమ కుటుంబ సభ్యులను బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వ్ అయిన చోట ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు తమ అనుకూలురు, అనుయాయులను పోటీలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సర్పంచ్ల రిజర్వేషన్ల వివరాలు..
మెదక్ సంగారెడ్డి సిద్దిపేట
పంచాయతీలు: 492 613 508
వందశాతం గిరిజన గ్రామాలు: 71 81 15
ఎస్టీ మహిళ : 29 39 6
ఎస్టీ జనరల్ : 42 42 9
నాన్ షెడ్యూల్ ఏరియా:
ఎస్టీ మహిళ: 10 6 2
ఎస్టీ జనరల్ : 11 12 5
ఎస్సీ మహిళ: 33 56 41
ఎస్సీ జనరల్ : 44 70 56
బీసీ మహిళ: 49 52 61
బీసీ జనరల్ : 59 65 75
అన్ రిజర్వ్డ్ మహిళ: 102 130 122
అన్ రిజర్వ్డ్ జనరల్: 113 141 131
వార్డుల రిజర్వేషన్ల వివరాలు..
మెదక్ సిద్దిపేట సంగారెడ్డి
వార్డులు: 4,220 4,508 5,370
వందశాతం గిరిజన వార్డులు: 526 110 596
ఎస్టీ మహిళ : 265 55 298
ఎస్టీ జనరల్ : 261 55 298
నాన్ షెడ్యూల్ ఏరియా :
ఎస్టీ మహిళ: 55 22 55
ఎస్టీ జనరల్ : 123 37 101
ఎస్సీ మహిళ: 235 325 480
ఎస్సీ జనరల్ : 423 524 643
బీసీ మహిళ: 410 517 464
బీసీ జనరల్ : 588 770 640
అన్ రిజర్డ్ డ్మహిళ: 849 995 1,107
అన్ రిజర్డ్ డ్ జనరల్: 1,011 1,208 1,284
