ఇన్​ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుంది

 ఇన్​ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుంది

ముంబై: సప్లయ్​ పరమైన షాక్స్ ​ఏవీ లేకుంటే దేశంలో ఇన్​ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుందని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మెంబర్​ ఆశిమా గోయెల్​ చెప్పారు. దేశపు  బయటి నుంచి వచ్చిన  షాక్స్​ను సమర్ధంగా తట్టుకుంటూ ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో మనం గ్రోత్​వైపు వెళ్తున్నామని పేర్కొన్నారు. బయటి దేశాల నుంచి వచ్చిన షాక్స్​ అనుకున్నంత తీవ్రంగా లేకపోవడంతో ఎకానమీ  గ్రోత్ రేటు​ 6.5 శాతానికి చేరడం సాధ్యమేనని వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు అనేది తాజాగా వచ్చే డేటా ఆధారంగానే జరగాలేనది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని నేను ఎంపీసీ సమావేశంలోనూ చెప్పానని ఆశిమా గోయెల్​ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సప్లయ్​ వైపు నుంచి షాక్స్​ లేకపోతే దేశంలో ఇన్​ఫ్లేషన్​ వేగంగానే 4 శాతం కిందకి దిగి వస్తుందని, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్సెస్​ డిమాండ్​ లేదని ఆమె వివరించారు. అనుకున్న దానికంటే గ్రోత్​ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్​ఫ్లేషన్ టార్గెట్​ సాధించే దిశలో మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు ఫోకస్​ పెట్టొచ్చని గోయెల్​ చెప్పారు. గ్లోబల్​గా ఉన్న కొన్ని పరిస్థితులు, వాతావరణపరమైన అనిశ్చితులూ....ఈ రెండూ మన దేశపు గ్రోత్​, ఇన్​ఫ్లేషన్​పై ఎఫెక్ట్​ చూపిస్తాయని పేర్కొన్నారు.