కృష్ణా ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు

కృష్ణా ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు

కృష్ణా బోర్డు జలాశయాల పర్యవేక్షణ కమిటీ మీటింగ్ ముగిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్స్ కర్వ్, మిగులు జలాల అంశాన్ని తేల్చడానికి ఏర్పాటైన రిజర్వాయర్ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరైంది. వర్షాకాల సీజన్ సన్నాహాల్లో ఉన్నందున సమావేశాన్ని జూన్ 15న నిర్వహించాలన్న తెలంగాణ వినతిని తోసిపుచ్చిన బోర్డు మీటింగ్ ను నిర్వహించింది. 

ఇక ఈ సమావేశంలో రూల్ కర్వ్స్ పై చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. ముసాయిదాపై కొన్ని వివరణలు ఆడిగినట్లు చెప్పారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలకు అనుకూలంగా రూల్ కర్వ్స్ ఉంటాయన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపు,వంటి అంశాలపై చర్చించినట్లు వివరించారు.  జూన్ మొదటివారంలో మరోసారి కమిటీ సమావేశం అవుతుందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ముసాయిదాకు ఆమోదం తెలిపి బోర్డుకు నివేదిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

మాదాపూర్లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

మోడీజీ మీ 8 ఏళ్ల పాలనకు 8 ప్రశ్నలు..!