మద్యపాన నిషేధానికి తీర్మానం

మద్యపాన నిషేధానికి తీర్మానం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామస్తులంతా కలిసి ఆదివారం గ్రామంలో మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. బెల్ట్​షాపుల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయించడం వల్ల యువత మద్యానికి బానిసలవుతున్నారన్నారు. గ్రామంలోని బెల్ట్ షాప్​లో మద్యం విక్రయిస్తే యాక్షన్​తీసుకోవాలని ఎస్​ఐ అబ్దుల్ గఫార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.