ఉద్యోగుల హెల్త్ కార్డులు, సీపీఎస్ సమస్యలు పరిష్కరించండి : టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు

ఉద్యోగుల హెల్త్ కార్డులు, సీపీఎస్ సమస్యలు పరిష్కరించండి : టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు
  • టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు  

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు వంటి తదితర పెండింగ్ సమస్యలన్నింటిని పరిష్కరించాలని టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను విడుదల చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, కింది స్థాయి ఉద్యోగులు ఆందోళనలో ఉన్న విషయాన్ని గమనించి సర్కారు డీఏ ప్రకటించిందని నేతలు గుర్తు చేశారు. సీఎంతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై మిగతా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని నేతలు పేర్కొన్నారు.