సెక్రటేరియేట్ పరిధిలో ఆంక్షలు

సెక్రటేరియేట్ పరిధిలో ఆంక్షలు

తెలంగాణ సెక్రటేరియేట్ పరిసరాల్లో దాదాపు  3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. సైఫాబాద్‌ పోలీసు స్టేషన్ ఏరియాల్లోకి వచ్చే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పబ్లిక్‌ సమావేశాలు, ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండటం నేరమన్నారు. సెక్రటేరియట్ చుట్టుపక్కలా ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, కర్రలు, లాఠీలు, కత్తులు తదితర ప్రమాదకర వస్తువులను కలిగివుండరాదని తెలిపారు. ప్రసంగాలు, నినాదాలు చేయరాదని, ర్యాలీలు, యాత్రలపైనా నిషేదం ఉంటుందని అన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలని అనుకుంటే… ముందుగానే దరఖాస్తు చేసుకుని, రాత పూర్వక హామీ ఇవ్వాలన్నారు. అనుమతి మంజూరైతేనే కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ ఆంక్షలు ఇవాళ్టి(డిసెంబర్-3) నుంచి ఫిబ్రవరి 2 వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు సీపీ అంజనీ కుమార్‌.