భారత పార్లమెంట్ ఆవరణలో ఆంక్షలు.. జర్నలిస్టుల నిరసన

భారత పార్లమెంట్ ఆవరణలో ఆంక్షలు..  జర్నలిస్టుల నిరసన

భారత పార్లమెంట్ ప్రాంగణంలో కొత్త ఆంక్షలు విధించడాన్ని జాతీయ జర్నలిస్టులు నిరసించారు. గతంలో పార్లమెంటేరియన్‌లతో సంభాషించిన మకర్ ద్వార్ ప్రాంతం నుండి వారిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో విధించిన ఆంక్షలే ప్రస్తుతం విధించడాన్ని ఒక రకంగా మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు. కొత్తగా విధానాలతో జర్నిలిస్టులపై పరిమితులు విధించారని పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను హరిచడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనంపై ఆంక్షలు విధించడం వంటిదే అని జర్నలిస్టులు తెలిపారు.

ALSO READ | బీజేపీ చక్రవ్యూహంలో జనం.. అప్పుడూ.. ఇప్పుడూ ఆరుగురే: రాహుల్ గాంధీ పంచ్ లు