న్యూఢిల్లీ : ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, ఆల్ఇన్వన్ పర్సనల్ కంప్యూటర్స్, అల్ట్రా స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ కంప్యూటర్స్, సర్వర్లు వంటి హార్డ్‌వేర్ ప్రొడక్టుల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమలులోకి వస్తాయని కూడా ప్రకటించింది. దీంతో దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ బిజినెస్ స్వల్పకాలంలోనే పుంజుకునే వీలుంటుందని తెలిపింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదని, తమకు మేలు కలుగుతుందని ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇండియాలోని పెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా పేరొందిన డిక్సన్ టెక్నాలజీస్ షేరు బీఎస్ఈలో 8 శాతానికి పైగా ఎగసింది.
కన్జూమర్లకు ఇబ్బందే....
షార్ట్టర్మ్లో సప్లయ్ సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని, అలాంటప్పుడు కన్జూమర్లకు ఇబ్బందులెదురవుతాయని ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు కొన్ని చెబుతున్నాయి. దేశంలో లాప్టాప్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టి ఆర్డర్లు రాక ఎదురుచూస్తున్న ఒక కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ ఇప్పుడైనా తనకు ఆర్డర్లు దక్కుతాయని ఆశాభావంతో ఉన్నారు. ఓపెన్ ఇంపోర్ట్ ప్రొవిజన్స్‌తో గతంలో సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్‌తో ఆ సమస్యలు సమసిపోయి, ఐటీ హార్డ్‌వేర్ ఫెసిలిటీస్‌కు మంచి రోజులు వస్తాయని మరో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సీనియర్ ఆఫీసర్ చెప్పారు.
ఏడు బిలియన్ డాలర్ల ఐటీ హార్డ్‌వేర్ బిజినెస్‌లో లోకల్ మాన్యుఫాక్చరింగ్ 60 నుంచి 70 శాతం దాకా షార్ట్టర్మ్లోనే ఎగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో లోకల్ మాన్యుఫాక్చరింగ్ 90 శాతానికి కూడా పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్తో టీవీ అసెంబ్లీలో ఏం జరిగిందో, ఇప్పుడు ఐటీ హార్డ్‌వేర్‌లోనూ అదే జరుగుతుందని వివరించారు.
డిక్సన్ టెక్నాలజీస్ షేరు జూమ్....
ఐటీ హార్డ్‌వేర్ ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించడంతో దేశంలోని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ బీఎస్ఈలో 8 శాతం ఎగసి రూ. 4,454.90 కి చేరింది. ఏసర్ కంపెనీకి లాప్టాప్లను అసెంబ్లింగ్ చేసేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ఇప్పటికే ఒక ఫెసిలిటీని నోయిడాలో ఏర్పాటు చేసింది. డిక్సన్ టెక్నాలజీస్ ఇటీవలే ప్రభుత్వం రివైజ్ చేసిన ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము కోసం అప్లయ్ చేసుకునే ప్రయత్నంలోనూ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలతో చైనా నుంచి దిగుమతులు ప్రధానంగా తగ్గిపోతాయని అంచనా.
లోకల్ మాన్యుఫాక్చరింగ్ పెంచేందుకే ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని ఐడీసీ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ చెప్పారు. వెండార్లు ప్రతీ క్వార్టర్లోనూ 20 లక్షల దాకా నోట్‌బుక్స్‌ను షిప్ చేస్తున్నారని, ఇందులో మూడొంతులు దిగుమతి చేసుకున్నవేనని, ప్రీమియం నోట్బుక్సయితే పూర్తిగా దిగుమతి చేసుకునేవేనని పేర్కొన్నారు. ఇప్పటికే అమ్మకాలు లేక గత రెండు, మూడు క్వార్టర్లుగా ఇబ్బందులు పడుతున్న పీసీ మార్కెట్‌కు ప్రభుత ఆంక్షల నిర్ణయం కొత్త సమస్యలు
తెచ్చి పెట్టొచ్చని అన్నారు.
పీఎల్ఐ డెడ్‌లైన్ పొడగింపు...
ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్ఐ స్కీము గడువును రెండోసారి ప్రభుత్వం పెం చింది. డెడ్‌లైన్‌లోపు తగినన్ని అప్లికేషన్లు రాకపోవడంతో గడువును పెంచారు. ఆగస్టు 30 లోపు పీఎల్ఐ స్కీము కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.
