ఆస్కార్‌‌ గెలిచినప్పటి నుంచి బాలీవుడ్‌లో అవకాశాల్లేవ్

ఆస్కార్‌‌ గెలిచినప్పటి నుంచి బాలీవుడ్‌లో అవకాశాల్లేవ్

చెన్నై: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌‌గా రెహమాన్‌కు, బెస్ట్‌ సౌండ్ మిక్సింగ్‌కు గానూ రసూల్‌ పూకుట్టికి ఆస్కార్ అవార్డులు వరించాయి. అనూహ్యంగా గత కొన్నేళ్లలో ఈ ఇద్దరికీ బాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రాకుండా ఓ గ్యాంగ్ రూమర్స్ ప్రచారం చేస్తోందని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ స్పందిస్తూ.. ‘రెహమాన్ మీ సమస్య ఏంటో తెలుసా? మీకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ వస్తే బాలీవుడ్‌లో చావును ముద్దు పెట్టుకోవడమే. బాలీవుడ్ శక్తికి మించి మీకు టాలెంట్ ఉందని అది నిరూపించింది’ అని పేర్కొన్నారు.

తాజాగా రసూల్ పూకుట్టి కూడా ఈ విషయంపై పెదవి విప్పారు. ‘శేఖర్‌‌ దీని గురించి నన్నూ అడగండి. ఆస్కార్ గెలిచాక బాలీవుడ్‌తోపాటు ప్రాంతీయ భాషా సినిమాల్లోనూ నాకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. కొన్ని ప్రొడక్షన్‌ హౌస్‌లు నా ముఖం మీదే ‘నీ అవసరం మాకు లేదు’ అని పొమ్మన్నాయి. అయినా సరే నేను నా ఇండస్ట్రీని ప్రేమిస్తా. దాని కోసం నిలబడతా’ అని రసూల్ చెప్పారు.