పెద్దగా మారని రిటైల్ ద్రవ్యోల్బణం .. 3.8 శాతం పెరిగిన ఐఐపీ

పెద్దగా మారని రిటైల్ ద్రవ్యోల్బణం .. 3.8 శాతం పెరిగిన ఐఐపీ

న్యూఢిల్లీ :  రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోల్చితే పెద్దగా పెరగలేదు. ఫిబ్రవరిలో  5.09 శాతం వద్ద నిలకడగా ఉంది.    వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 5.1 శాతం, 2023  ఫిబ్రవరిలో 6.44 శాతంగా ఉంది.  ఆహారానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.66 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో 8.3 శాతం ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్‌‌తో 4 శాతం వద్ద ఉండేలా ప్రభుత్వం ఆర్​బీఐకి బాధ్యతలు అప్పగించింది.  

సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–-24) సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతంగా అంచనా వేసింది. ఇది జనవరి–-మార్చి త్రైమాసికంలో 5 శాతంగా నమోదైంది.  మనదేశ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) జనవరిలో సంవత్సరానికి 3.8 శాతం పెరిగింది.  భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి జనవరిలో 3.2 శాతం ఉంది. 2023 జనవరిలో 4.5 శాతంగా నమోదయింది.

అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం

అమెరికాలో వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం పెరిగింది. గ్యాసోలిన్​ రేట్ల కారణంగా కోర్ ​కన్జూమర్​ప్రైస్​ఇండెక్స్​(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.4 శాతం పెరిగింది. జనవరిలో ఇది 0.3 శాతం పెరిగింది. సీపీఐలో ఆహారం, ఇంధన ఖర్చులు ఉండవు. ఏడాది లెక్కన వినియోగదారుల ధరలు గత నెలలో 3.2 శాతం పెరిగాయి.