ఆగస్టులో రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ రికార్డ్

 ఆగస్టులో రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ రికార్డ్

న్యూఢిల్లీ:  కూరగాయల రేట్ల పెరుగుదల కారణంగా జులై నెలలో  15 నెలల గరిష్టానికి  చేరి భయపెట్టిన రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ ఆగస్టులో కొంత ఊరట కలిగించింది. ఆర్​బీఐ లిమిట్​ కంటే ఇంకా ఎక్కువగానే 6.83 శాతంగా ఆగస్టులో రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ రికార్డయింది. జులైలోని 7.44 శాతం నుంచి ఆగస్టులో కన్జూమర్​ ప్రైస్​ ఇండెక్స్​ (రిటైల్ ఇన్​ఫ్లేషన్​) 6.83 శాతానికి దిగొచ్చినట్లు స్టాటిస్టికల్​ మినిస్ట్రీ రిలీజ్​ చేసిన డేటా వెల్లడించింది. మొత్తం బాస్కెట్లో సగానికి అకౌంటయ్యే ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​ ఆగస్టులోనూ 9.94 శాతం ఎగసింది. అయితే, ఈ పెరుగుదల జులైలోని 11.51 శాతం కంటే తక్కువే. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గత ఏడాది కాలంగా ఆహార ఉత్పత్తుల రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కూరగాయలు, పాలు వంటి వాటి ఉత్పత్తిపై వాతావరణ ప్రభావం కనిపిస్తోంది. 

జులైలో ఐఐపీ జూమ్​...

జులై నెలలో ఇండెక్స్​ ఆఫ్​ ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్​ (ఐఐపీ) 5.7 శాతం ఎగసింది. అంతకు ముందు నెల అంటే జూన్​2023 లో ఐఐపీ పెరుగుదల 3.7 శాతమే. మైనింగ్​, మాన్యుఫాక్చరింగ్​, ఎలక్ట్రిసిటీ సెక్టార్లు జులై నెలలో మెరుగైన పనితీరు చూపించినట్లు డేటా చెబుతోంది.