న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా రూ. 18 వేల కోట్ల ఫాలో ఆన్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువయ్యింది.వీరి కోసం 630 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా, 290.35 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. 46 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయ్యింది. అదే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల సెగ్మెంట్ 10.62 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది. 360 కోట్ల షేర్లు ఉంటే 3,823 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. మొత్తంగా కంపెనీ ఎఫ్‌పీఓ 3.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
