ప్రతిపక్షాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలే గానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు : ఎల్.వి.సుబ్రమణ్యం

ప్రతిపక్షాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలే గానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు : ఎల్.వి.సుబ్రమణ్యం

రిటైర్డ్ ఐఎఎస్ ఎల్.వి.సుబ్రమణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఎంతోమంది త్యాగమూర్తులు పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అన్నారు.

ప్రతిపక్షాలపై ప్రభుత్వాలు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలే తప్ప.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. మనం పాకిస్థాన్ లో పుట్టి... అక్కడే పెరగలేదు.. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించకుండా చూడాలి అని సూచించారు. 

ప్రజలను అప్రమత్తం చేయడానికే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేశామన్నారు. తమ వెనుక ఎవరూ లేరని.. ఎవరి ఆర్థిక సహాయం కూడా తమకు అవసరం లేదన్నారు. ఆదివారం (డిసెంబర్ 10న) తిరుపతిలో జరిగే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సమావేశానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 13వ తేదీ కూడా విజయవాడ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.