NSB చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా దేవేశ్ చతుర్వేది

NSB చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా దేవేశ్ చతుర్వేది

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి దేవేశ్​ చతుర్వేదిని నియమించారు. మరో సభ్యుడిగా టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోడియం (టాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మాజీ సీఈవో కమోడోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పీకే గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లకు గుర్తింపు ఇవ్వడానికి లేదా రద్దు చేయడానికి, అలాగే క్రీడా పరిపాలన అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరపడానికి ఈ బోర్డుకు పూర్తి అధికారాలు ఉంటాయి. 

ఎన్నికల్లో అవకతవకలు జరిగినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా ఫెడరేషన్లను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అధికారం ఈ బోర్డుకు ఉంటుంది. ఈ ఇద్దరు సభ్యులు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 60 ఏళ్ల చతుర్వేది 1989 యూపీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి. ఆగస్టు 2024 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేశారు.